విశ్వనాథ్ పేరి, హైదరాబాద్ కు చెందిన ఇతనికి చిన్న వయసు నుండే వినికిడి శక్తి సరిగ్గా లేదు, మాటలు కుడా సరిగ్గా వచ్చేవి కాదు. బీటెక్ మధ్యలో ఆపేసి యానిమేషన్ కోర్సు చేసి త్రిడీ ఆర్టిస్టుగా జాబ్ సంపాదించాడు. విశ్వనాథ్ కి సాహస క్రీడలు అంటే చిన్ననాటి నుండి ఏంతో ఆశక్తి, ఆ ఆశక్తితోనే ప్రపంచంలోనే అతిపెద్ద మోటారు సైకిల్ రహదారిని పూర్తి చేసాడు. 600కిమీల సైక్లింగ్ రైడ్ లు, ట్రెక్కింగ్ లు, హాఫ్ మారథాన్, బంగీజంప్ లు అని అనేక సాహసాలు అతని ఖాతా లో ఉన్నాయ్.
పేస్ బుక్ లో ఒక గ్రూప్ ని తయారు చేసి తనలాంటి వాళ్ళందరిని ఒక చోట చేర్చి 200, 300, 600 కి. మీ ల సైక్లింగ్ రైడ్ లు, అనేక ట్రెక్కింగ్ లు, రెండు మారథాన్ లు విజయవంతంగా పూర్తి చేసాడు. ఇలాంటివి ఎన్నో సాధించిన విశ్వనాథ్ కి ఇంకా పెద్దది కోరిక మిగిలుంది, అందుకే ఈసారి ప్రపంచంలోనే అత్యంత ఏతైన మోటారు సైకిల్ రహదారిని పూర్తి చేయడానికి నిర్ణంచుకున్నాడు. ఐదుగురితో కలిసి ఆ సాహసాన్ని పూర్తి చేయడానికి జమ్ముకాశ్మీర్ కు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చలిని ప్రమాదకరమైన రహదారులని చూసి ఒకొక్కరు తప్పుకున్నా కూడా విశ్వనాథ్ మాత్రం ముందుకు సాగి విరిగిపడుతున్న కొండచరియలను కూడా లెక్కచేయకుండా తన లక్ష్యన్ని పూర్తి చేసాడు.
అంత లక్ష్యన్ని చేరుకున్నాక కూడా ఏమాత్రం అలసట చెందకుండా చెన్నైకు వెళ్ళి అక్కడ 600కిమీల సైక్లింగ్ పోటిలో పాల్గొన్నాడు. ప్రమాదవ శాత్తు పడి తీవ్ర గాయాలు అయిన చికిత్స తీసుకొని పోటీని పూర్తి చేసాడు. ఇంకా ఏన్నొ సాహసాలను విశ్వనాథ్ పూర్తి చేయాలని ఛాయి బిస్కెట్ కోరుకుంటుంది. అతని లాగా మీకు కూడా ఇలాంటి వాటి మీద ఆశక్తి ఉంటే అతనిని ఫేస్ బుక్ ద్వారా సంప్రదించి మీరు కూడా సాహసాలు చేయండి.