జానపదాలు పెట్టింది పేరు, విఠలాచార్య గారు. ఎంతలా అంటే, ఇప్పటికి మాయలు మంత్రాలు ఉన్న సినిమాలలో ఆయన reference చాలా ఉంటుంది. NTR గారు, కాంతారావు గారు, వీళ్ళతో చేసిన సినిమా ఇప్పటికి చూడటానికి బాగుంటాయి. ఆ plot కానీ, action sequences, కత్తి యుద్ధాలు. Trust me you will enjoy to the core. అప్పటికి ఎవరు సాహసం చేయని సినిమాలను direct చేసి, produce చేసిన ఆయనకు జానపద బ్రహ్మ అనే పేరు ని సార్ధకం చేసే సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి.
1. బందిపోటు: కత్తులు, సంకెళ్లు అన్నిటిని అసలైనవి, వాడేవాళ్ళు, మరి ముఖ్యంగా, ఎన్టీఆర్ సినిమాలకి.
2. అగ్గిపిడుగు కేవలం, పోరాటాలే కాకుండా, ఒక మంచి కథ, స్క్రీన్ప్లే ఉండేవి ఆయన సినిమాలలో
3. మంగమ్మ శపథం strong female characterisation ఉండేది. సినిమాలో కథానాయిక ప్రాధాన్యం ఉండేట్టు చూసుకునేవాళ్ళు విటలాచార్య గారు. ఈ సినిమ అందుకు మంచి ఉదాహరణ.
4. చిక్కడు దొరకడు విఠలాచార్య సినిమా titles కూడా చాలా ఆసక్తి ని రేపేవి. ఎంతో unique గా ఉంటాయి ఆయన పాత్రల పేర్లు కూడా.
5. పిడుగు రాముడు చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పే కథలు లాగ, మరో ప్రపంచం లో కి తీస్కుని వెళ్తారు విఠలాచార్య గారు తన సినిమాలతో.
6. అగ్గి వీరుడు ఎన్టీఆర్ గారు చాలా సినిమాలు తీశారు విఠలాచార్య గారు. ఈయన direction ఎన్టీఆర్ action చూసే ప్రతి ప్రేక్షకుడికి full meals.
7. ఆలీ బాబా 40 దొంగలు తెరుచుకో సెసేమ్, తెరుచుకో.
8. లక్ష్మి కటాక్షం ఎంత grandeur గా తీసిన, ఆయన నుండి సినిమాలు ప్రతి సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు వచ్చేవి.
9. కదలడు వదలడు Plot, screenplay చాలా gripping గా ఉంటుంది. కొంచెం involve అయితే మంచిగా ఏంజాయ్ చేయొచ్చు..
10. జగన్మోహిని మనలో చాలా మందికి తెలిసిన విటలాచార్య సినిమా ఇదేనేమో.
ఇందులో ఏ సినిమా చూడకపోయినా ఇప్పుడే చూసేయండి. మంచి టైంపాస్ అవుతుంది. ఈ రోజు విఠలాచార్య గారి పుట్టినరోజు. ఆ సందర్బంగా విటలాచార్య నమో నమ:. Thankyou for those wonderful visual wonders.