అహింసావాది అయిన మహత్మ గాంధీకి వివేక నందుడే స్పూర్తి, హింసా మార్గం ద్వారానే స్వాతంత్రం సాధించగలం అని నమ్మే సుభాష్ చంద్రబోస్ కు ఆయనే స్పూర్తి. వీరిద్దరి దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే వీరిద్దరి ఆలోచనలు వేరైనా స్వామి వివేకనందుని జీవితమే వారిద్దరికి స్పూర్తి అని చాలా సంధర్భాలలో వెల్లడించారు.. కేవలం భారతీయులు మాత్రమే కాదు ఆయనకు ప్రపంచమంతా అభిమానులే. మహనీయుల విలువ వారు జీవితం ద్వారా తెలుస్తుంది..
వారు ఎదుటివారితో స్పందించే తీరులో ఉంటుంది.
స్వామి అమెరికాలో ఉండగా ఎదురైన రెండు అనుకోని సంఘటనలకు వేరు వేరుగా స్పందించారు ఒకసారి ఒక అమెరికన్ సిటిజన్ స్వామిని ఇలా ప్రశ్నించాడు.. నీ దేశంలో అందరు ఎలా కలిసి ఉంటున్నారు ఒకడు తెల్లగా ఉంటాడు ఇంకొకడు నల్లగా కొంతమంది ఎర్రగా మరికొందరు చామన ఛాయగా ఉంటారు కాని మా దేశంలో అందరు తెల్లగానే ఉంటారు అంటు వెక్కిలి మాట్లాడాడు దానికి స్వామిజి ఇలా బదులిచ్చాడు అవును మేమందరం రకరకాలుగా ఉంటాం కాని కలిసే ఉంటాం నువ్వు ఎప్పుడైనా గాడిదలను చూశావా?? అవన్నీ ఒకే రంగులో ఉంటాయి ఇప్పుడు చెప్పు అవ్వి గుర్రాలను భయపెట్టగలవా...!! (ప్రశ్న అడిగిన వాడి ముఖం మాడిపోయింది).
ఓ అమెరికా వనిత వివేకనందుడిని దగ్గరికి పిలిచి ఇలా అడిగింది స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను దానికి మీరు అంగీకరించండి.. స్వామి ఆమెను మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది అని వినయంగా అడిగారు.
అందుకామె మీ తెలివితేటలు, మి మంచితనం నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళిచేసుకొని మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది అన్నది.
స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానమిచ్చారు.
నా తెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి నా మంచితనం మీకు నచ్చింది కాబట్టి మీ కోరికను తప్పుబట్టను. నా లాంటి బిడ్డను కావాలనుకోవడం తప్పు కాదు కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. మీ కోరిక తీరడానికి సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నా వంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పోందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది." అని ఆమెకు నమస్కరించారు.
ఎలాంటి వారికి ఎలా స్పందించాలో స్వామిజీకి బాగా తెలుసు అందుకే ఆయన వివేకనందుడు అయ్యాడు
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.