లక్ష్మీ నారాయణ ఐదు సంవత్సరాల నుండే బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టాడు. ఆట వస్తువులు, టీవీ, పుస్తకాలు, మనుషులు ఇలా ఎవ్వరూ ఏది కనిపించినా వీళ్ళ బొమ్మను పెన్సిల్ తో ఎలా వెయ్యవచ్చు అని మనసులోనే రిహార్సల్స్ చేసుకునేవాడు. మొదట్లో తీక్షణంగా కాసేపు చూడడం కాస్త ఇప్పుడు చూసిన క్షణాలకే స్కాన్ చేసి బొమ్మలకు రూపం ఇచ్చేస్తున్నారు.
జే.ఎన్.టి.యూ లో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ తను నేర్చుకున్న కళను 100 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా నేర్పించాడు. వయసుతో పాటు లక్ష్మీ నారాయణ టాలెంట్, పేరు కూడా విస్తరిస్తూ వస్తున్నాయి. మెట్రో ఫిల్లర్స్, వెంగల రావ్ పార్క్, ఫ్లై ఓవర్స్ లాంటి ప్రాంతాలలో చిత్రాలను వేసి ప్రభుత్వంతో కలిసి పనిచేశారు కూడా.
లక్ష్మీ నారాయణ అన్ని రకాల పెయింటింగ్స్ వెయ్యగలరు అత్యధికంగా "Wall Mural" పెయింటింగ్ వల్ల మరింత ఎక్కువమందికి చేరువయ్యారు. ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన ప్రదేశంలో, నచ్చిన వ్యక్తులతో ఉండాలని ఉంటుంది, రకరకాల కారణాల వల్ల సాధ్యపడకపోవచ్చు. ఒక్కసారి లక్ష్మీ నారాయణ వేసే వాల్ పెయింటింగ్స్ ద్వారా మాత్రం అది సాధ్యం అవుతుంది. ఆయన వేసే ప్రతి చిత్రంలో మరో ప్రపంచం కనిపిస్తుంది. నచ్చిన వ్యక్తులు కావచ్చు, నచ్చిన ప్రదేశాలు కావచ్చు వాటిని చూస్తూ ఉంటే మన ప్రపంచం కాసేపు ఆగిపోతుంది. అలాంటి లక్ష్మీ నారాయణ Wall Murals కొన్ని..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.