యూత్ లోని చురుకుతనంతో పాటు పెద్దవారి అనుభవం కూడా తోడైతే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఇదే పద్దతి అమలవుతుంది. ఒక స్టార్ హీరోను, పొలిటీషియన్స్ కు అభిమానులన్నట్టే ఐ.ఏ.ఏస్, ఐ.పి.ఎస్ అధికారులకు కూడా వారు చేస్తున్న అభివృద్ధి పనుల ద్వారా అభిమానులు పెరుగుతున్నారు. అమ్రపాలి గారు వరంగల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ అధికారుల సోమరితనాన్ని, సమస్యలను సమూలంగా పరిష్కరిస్తున్నారు.
WhatsApp Group: బహుశా మన గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న బద్దకం మరేచోట ఉండదనుకుంటా.. వరంగల్ లో ఎస్సి, బీసి సంక్షేమ హాస్టల్స్ చాలా అద్వాన్నంగా తయారయ్యాయని, దీనికి ప్రధాన కారణం హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించిన అమ్రపాలి గారు వాట్సప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. భావి భారత విద్యార్ధులున్న హాస్టల్స్ ను పరిశుభ్రంగా చూసుకుంటూ, ప్రతిరోజు స్టూడెంట్స్ ను వరుస క్రమంలో కూర్చోబెట్టి బ్రేక్ ఫాస్ట్ వడ్డించిన తర్వాత విద్యార్ధులతో బాటు సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీని ప్రతిరోజు ఆ వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ పోస్ట్ చేయకుంటే: ఆ.. ఇదంతా మామూలే ఎన్ని చూడలేదు రెండు, మూడు రోజులు లేదంటే మహా ఐతే ఓ నెల అంతే దాని తర్వాత మామూలే అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. ప్రతిరోజు గ్రూప్ లో సెల్ఫి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఆరోజు Absent ఐనా, గ్రూప్ లో సెల్ఫీ పోస్ట్ చేయకపోయినా గాని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమ్రపాలి గారు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చేశారు. వరంగల్ అర్భన్ లో మొత్తం 35 బిసీ, ఎస్, ఎస్టి హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 5,000 వరకు చదువుకుంటున్నారు.
ఈ పద్దతి చాలా బ్రహ్మాండంగా అమలు జరుగుతుండడంతో మంచి పలితాలు వచ్చేస్తున్నాయి. అంతకు ముందు ఎవరైనా మంత్రులు వచ్చేముందే హాస్టల్స్ ను పట్టించుకునే కొంతమంది అధికారులు.. ఇప్పుడు ప్రతిరోజు పరిశీలించడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుకునే వసతులన్నీ వస్తున్నాయి.