ప్రతి ఇంటికి ఒక డస్ట్ బిన్ ఉన్నట్టుగానే ఈ భూమి అనే ఇంటికి ఒక్క డస్ట్ బిన్ కూడా లేదు. ఎంత పొల్యూషన్, ఏ చెత్త ఉన్నా ఈ భూమి అనే ఇంటి మీదనే ఉంటుంది తప్ప పక్కింట్లోకి చెత్త విసిరేసినట్టుగా ఇంకో గ్రహం మీదకు చెత్త వెయ్యలేము. మనం నివసించే ప్రదేశంలో ఈ చెత్త ఉంటే కొంత భాగమైనా ఎలాగోలా క్లీన్ చేసుకోగలం, రీసైకిల్ చేసుకోగలం మరి సముద్రంలోని జీవుల పరిస్థితి ఏంటి.? ఒక్క మనిషి తప్ప పనికిరాని చెత్తను ఏ జీవి సృష్టించలేదు. ఒక రీసెర్చ్ ప్రకారం సముద్రంలో పొల్యూషన్ వల్ల 870 రకాల జీవులకు హాని కలుగుతుంది, మరి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా పొల్యూషన్ 23% అధికంగా పెరిగింది. ఈ సాగర ఘోష విన్న కొందరి వ్యక్తులలో పద్మావతి, సుభాష్ దంపతులు ఒకరు. వారికి సముద్రం అంటే ఒకరిమీద మరొకరికి ఉన్నంత ప్రేమ అందుకే వారు బీచ్ ను చూస్తూ ఎంజాయ్ చెయ్యడం లేదు క్లీన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రధాని నుండి అభినందలు, ఇంతకీ వీళ్ళేం చేస్తారు.? ప్రధాని నరేంద్రమోదీ గారు అధికారం చేపట్టిన కొంతకాలనికే "స్వచ్ఛ భారత్" ను మొదలుపెట్టారు, ఈ స్పూర్తితోనే పద్మావతి సుభాష్ గార్లు మాత్రం సముద్రంలో స్వచ్ఛ భారత్ ను మొదలుపెట్టారు. సముద్రంలో చెత్తను తీసివేయడంతో పాటు, బీచ్ లో చెత్త వేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అనే విషయాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తుంటారు. అలాగే వీరిని చూసి మరింతమంది ముందుకు రావాలని సోషల్ మీడియాలోనూ పోస్ట్ లతో యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటి వరకు ఈ దంపతులు ఇంకా సహాయంగా వచ్చిన వ్యక్తులు కలిసి 10,000 కిలోలకు పైగా ప్లాస్టిక్ ను తొలగించారు. విశాఖపట్నంలో ప్రతిరోజు 1200 టన్నుల చెత్త వస్తుంటే 900 టన్నుల చెత్త డంపింగ్ యార్డ్ కు చేరుకుంటుంది, మిగిలినదంతా సముద్రంలో కే వెళ్ళిపోతుందని ఒక అంచనా.

ఈ కపుల్ చేస్తున్న కార్యక్రమాలు ప్రధాని మోదీ గారిని కూడా తాకాయి. ఆయనకు ఎంతో ఇష్టమైన మన్ కీ బాత్ లో "శుభ్రత కార్యక్రమాలను భూమి మీద చేస్తుంటారు, కానీ పద్మావతి సుభాష్ మాత్రం సముద్రంలో చేస్తూ జీవుల మనుగడకు ఇబ్బంది కలుగకుండా చేస్తున్నారు" అని ప్రత్యేకంగా అభినందించారు.


ప్రేమ చేసిన పెళ్లి: పద్మావతి గారు తెలుగువారు, సుభాష్ గారిది కేరళ, వారిద్దరిని కలిపింది మాత్రం ప్రేమ. ప్రేమకు మాత్రం ప్రాంతాలు, పేర్లు లేవు. సుభాష్ గారు స్కూబా డ్రైవింగ్ శిక్షణ ఇస్తూ ఉంటారు. పద్మావతి గారు స్కూబా డ్రైవింగ్ సుభాష్ గారి దగ్గర నేర్చుకునే వేళనే వారిద్దరిలోకి ప్రేమ వచ్చి చేరింది. సముద్రపు ఒడ్డునే మనసులు, ఉంగరాలు మార్చుకున్నారు.

చూసి తట్టుకోలేకపోయారు: పెళ్లి తర్వాత కొంత కాలానికి మన విశాఖపట్నంలోనే స్కూబా డ్రైవింగ్ లో కోచింగ్ ఇచ్చేవారు. ప్రతిరోజు సముద్రంలోనే ఎక్కువ సమయం గడుపుతుండడం వల్ల అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. చుట్టూ ప్లాస్టిక్, ఇతర వస్తువులు, చెత్తచెదారంతో చేపలు, తాబేళ్లు మొదలైన సముద్ర జీవుల ఇబ్బందులు చూసి తట్టుకోలేకపోయారు. రోజులో మన పనులు మనం చేసుకుంటూనే కొంత సమయం దీనిని క్లీన్ చెయ్యడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

అలా వీలా బృందం ఇప్పాటి వరకు 61 క్లీన్ అప్స్ చెసి కొన్నీ టన్నుల ప్లాస్టిక్ మరియు వ్యర్థాలు ని బయాటాకి తిసారు ..

For more details about their work and services, check their Instagram: Platypus Escapes