మనిషి బ్రతకడానికి అవసరమైన ఐదు ముఖ్య అంశాలలో నీరు కూడా ఒకటి, దీనిని ప్రకృతి మనకు ఏ కష్టం కలిగించకుండానే ఉచితంగా ఇస్తుంది. మాములు నీటిని మంచినీరుగా మార్చాము, మేము ఇచ్చే మంచి నీరే అసలైనది అని చెప్పి భయపెట్టి, నమ్మకం కల్పించి 500ml వాటర్ బాటిల్ ను కూడా వందరూపాయలకు అమ్ముతున్న రోజులు ఇవి. ఐతే ఈ రోజులను క్రమంగా మార్చడానికి ప్రభుత్వం, ఓ ప్రయివేట్ కంపెనీ కేవలం ఐదు రూపాయలకే మంచి నీళ్ల బాటిల్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
Atmospheric water generator.. గాలిలో తేమ నుండి మంచినీటిని తీసుకుని మనకు రూ.8 కే లీటర్ మంచినీటిని అందించే ఈ మెషిన్ కు 'మేఘ్ దూత్' అని పేరు పెట్టారు. దీనిని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మైత్రీ ఆక్వాటెక్ అనే సంస్థ తయారుచేసి మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు. పర్యావరణ రక్షణ, అలాగే స్వచ్ఛమైన మంచినీరును తక్కువ ధరకే ఇవ్వాలనే సంకల్పం దీని ఆవిష్కరణకు గల మూల కారణాలు.
ఎలా పనిచేస్తుంది.? మన చుట్టూ ఉండే గాలిలో తేమ ఉంటుంది. దీనిని తీసుకోవడం కోసం రిఫ్రిజిరేషన్ పద్దతిని ఉపయోగిస్తారు. బయటి నుండి ఇలా సేకరించిన గాలి కూల్ కాయిల్స్ లో పంపించే మార్గంలో తేమ నీరుగా మారుతుంది. గాలిలో ఉన్నట్టుగానే ఆ నీటిలోను హానికర బాక్టీరియా, పొల్యూషన్ పార్టికల్స్ కూడా ఉంటాయి, వీటిని ముందుగానే అమర్చిన ఫిల్టర్లు తొలగిస్తాయి. ఇలా వివిధ రకాలుగా శుభ్రపరచడం ద్వారా మంచినీరు లభిస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అమర్చిన ఈ మెషిన్ ప్రతిరోజు 1,000 లీటర్ల మంచి నీటిని విడుదల చేస్తుంది. భవిషత్తులో మరిన్ని చోట్ల విస్తరించాలనే ప్లానింగ్ లో ఉన్నారు.