ఇంట్లో కుక్కనో పిల్లినో పెంచుకోవడం ఒక చక్కని అలవాటు. అమాయకంగా ముద్దు ముద్దుగా మనల్ని చూస్తే వాటి ప్రేమలో మనం ఈజీగానే పడిపోతాం.. ఇంట్లో మూగ జీవాలను పెంచుకోవడం వల్ల "మనం ఒంటరిగా ఉన్నామన్న దిగులుకు లోనుకాము, మన స్ట్రెస్ లెవల్స్ కూడా బ్యాలెన్స్ లో ఉంటాయని" ఒక రీసెర్చ్ లో కూడా తేలింది. పెట్ ను పెంచుకోవడం, మంచి ఫుడ్, లాంటి బాగోగులు అంటే మనం చేసుకుంటాము.. అదే మనం అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సివస్తే.? ఎవరింట్లో వదిలిపెట్టాలి.!! మనకేదో ఎగ్జామ్ ఉంటే.? అమ్మ చూసుకుంటుందా.!! ఇదిగో ఈ ఆలోచనే సుమతి గారి "Petcetera" స్టార్టప్ పుట్టకకు కారణమయ్యింది.
లక్షల జీతం వద్దు!! సుమతి గారు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేశారు. తనకున్న టాలెంట్ కు అనుగుణంగానే ప్రతినెలా లక్షల్లో జీతం!! "మనకు నచ్చిన పనిచేసుకునే పరిస్థితులు రావడంతో ఆ డైరెక్టర్ పదవికి రాం రాం చెప్పేసి, ఈ పెట్ కేర్ ను మొదలుపెట్టారు. ఊరు వెళ్తున్నవారు తమ పెంపుడు జంతువులను సుమతి గారికి అప్పజెబితే మంచి స్నేహితులుగా యజమానులు వచ్చే వరకు వాటి బాగోగులు చూసుకుంటారు. సుమతి గారికి చిన్నతనం నుండి పెట్స్ మీద ప్రేమ ఎక్కువ. బయట తిరిగే కుక్కలకు ఆహారం పెట్టడం, పిచ్చుకుల కోసం గింజలు వెయ్యడం.. ఇలా రకరకాలుగా వాటితో అనుబంధం ఉండేది. వాటికి ఎంత చిన్న గాయం, అపాయం జరిగిన తనకు తగిలినంత ఇబ్బందికి లోనయ్యేవారు. ఎక్కడ ఏ ప్రాణికి గాయమైన ఇంటికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటారు.. ఎప్పుడు తన ఇంటికి వెళ్లినా గాయపడిన ఎదో ఒక పక్షి గాని, జంతువు గాని వారి ఇంటిలో కనిపిస్తుంది.
సుమతి గారి ఇంటిని పెట్స్ వదిలి వెళ్లలేవు!! పెట్స్ చూసుకుంటాము అంటే ఒక చైన్ తీసుకుని కట్టెయ్యడం కాదు.. యజమానులకు దూరంగా ఉన్న ఆ సమయం పెట్స్ కు ఆటవిడుపులా సుమతి గారు చూసుకుంటారు. పెట్స్ కోసం విశాలమైన ఇంటిలో స్విమ్మింగ్ ఫుల్, టాయ్స్, ఇండోర్ అవుట్ డోర్ ప్లే ఏరియా మొదలైనవన్నీ petcetera లో ఉన్నాయి. మనకన్నా స్వేచ్ఛ ఉంది కాని ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు అస్సలు లేదు, ఎప్పుడూ కట్టేసి ఉంచుతుంటారు, బయటకు వెళ్లినా కూడా రోజు వెళ్లే ఒక దారిలోనే ఒక 5నిమిషాలు వాకింగ్, పోనీ ఇంకెక్కడికైనా తీసుకెల్దామాన్న ఎన్నో ఇబ్బందులు, కనీసం పార్క్ లోకి కూడా వాటికి అనుమతి లేదు. ఇలా ఇరుకుగా బ్రతుకుతున్న పెట్స్ సోషలైజింగ్ కు కూడా Petcetera మంచి రిలీఫ్ ఉంటుంది.
ఇక్కడ వదిలినప్పుడే పెట్స్ ఎలాంటి భోజనం చేస్తుంది, ఎంత పరిమాణం, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా.? మందులు వాడుతున్నారా.? ఏ టైమ్ లో ఔటింగ్ కి తీసుకెళ్తారు.? ఇలా అన్ని విషయాలు తెలుసుకుని ఉన్న కొద్ది రోజులైనా సరిగ్గా అవ్వే పాటిస్తారు. కొన్ని కుక్కలైతే తమ యజమాని తిరిగి వచ్చేవరకు భోజనం చేయవు, దిగులుగా కూర్చుని ఉంటాయి అందుకే "సోఫా, బీన్ బ్యాగ్, కూలర్ ఇలా ఇంటి వాతావరణం, రకరకాల గేమ్స్" అలాగే పెట్స్ కోసం సెపరేట్ గా బెడ్, మంచి ఫుడ్ మొదలైన ఏర్పాట్లను చేశామని సుమతి గారు అంటారు.
For additional information: Contact: 98857 27269 https://www.facebook.com/profile.php?id=100002993206862