చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, బస్సులో ప్రత్యేక సీట్లు, భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు పెన్షన్లు.. ఇలా ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు ఉపయోగపడడం మనం ఇంత వరకు చూశాం. దేశంలోని అన్ని ప్రభుత్వాల కన్నా మన తెలంగాణ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి మహిళా పారిశ్రామికులను ప్రోత్సాహించడానికి టీ-హబ్ తరహాలో వీ-హబ్ ను ప్రారంభించబోతున్నారు. స్టార్ట్ అప్స్ తో దుసుకుపోతున్న నేటి యువతలో మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో ఉండాలన్నదే లక్ష్యం.
పటాన్ చెరు లోని ఇండస్ట్రీయల్ గ్రీన్ పార్క్ లో 40 వేల చదరపు అడుగుల్లో ఈ వీ- హబ్ ను నిర్మిస్తున్నారు. ఇందులో 200కు పైగా పరిశ్రమలు మహిళలు నిర్వహిస్తున్నవే. వీ-హబ్ ద్వారా మహిళలకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఉపాధి కూడా అందిస్తారు. కొత్త ఆలోచనలతో వచ్చేవారికి సబ్సీడీలు, త్వరగా అనుమతులతోపాటు, 24గంటలపాటు నిర్విరామంగా పవర్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో పురుషుల స్థాయిలో స్త్రీలు కూడా సమానంగా ఎదగాలన్నేదే ఈ వీ-హబ్ ధ్యేయం.