మన తెలుగుతేజం, దేశగర్వం సింధూ గారు ఈ మధ్యనే రియో ఒలంపిక్స్ లో రజితపతకం గెలుచుకున్నారు మనమందరం చాలా ఆనందపడిపోయాం.. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పోటిపడి మరి ఎన్నో కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాయి.. సచిన్ చేతుల మీదుగా BMW కార్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటిస్థలాలు, వారి బ్రాండ్ వాల్యు పెంచుకోవడానికి ఎన్నో కంపెనీల నుండి ఎండార్స్ మెంట్స్ ఇంకా చాలా.. ఇదంతా బాగానే ఉంది చాలా బాగుంది దేశంలోని గొప్పవాళ్ళను గౌరవించుకోవడం మన సంప్రదాయం. మరి ఈ సంప్రదాయం కేవలం కొంతమందికేనా? మిగిలిన క్రీడాకారులకు కాదా?

ఒకటి కాదు రెండు కాదు 13 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆఫీసుల చుట్టు చెప్పులు అరిగేల తిరిగిన ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు అందక మన తెలుగు క్రీడాకారిని వేయిట్ లిఫ్టర్ పూజారి శైలజ అనుభవిస్తున్న ధీన గాధ ఇది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూజారి శైలజ జాతీయ స్థాయిలో 26 స్వర్ణ(గోల్డ్) పతకాలు, అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణ పతకాలు సాధించారు. అవార్డులు మెడల్స్ కు ఏ లోటు లేదు కాని ఆర్ధిక బహుమానం, ఉద్యోగం విషయంలో తప్ప..! 2002లో అప్పటి ప్రభుత్వం ఘనంగ ప్రకటించింది "తెలుగు తేజం పూజారి శైలజకు 1000గజాల స్థలంతో పాటు 60లక్షల నగదు బహుమానం, ప్రభుత్వ ఉద్యోగం అని.." కాని 13 సంవత్సరాలనుండి తనకు అందింది కేవలం 30లక్షలు మాత్రమే! మిగిలిన నగదు, ఉద్యోగం, ఇంటి స్థలం కోసం నిత్యం సంభందిత అధికారులు, కలెక్టర్లు, ఆకరికి ముఖ్యమంత్రులు నాటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరి నుండి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు, కొణిజేటి రోశయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుగారు ఇలా ఎంతమందిని కలిసినా ప్రయోజనం శూన్యం.. ఆర్ధిక అవసరాల కోసం తన ప్రాక్టీస్ ను కూడా మానేసి ప్రభుత్వం చుట్టు తిరిగిన అందని సాయం..!

అసలే మన దేశంలో ఆడపిల్లలంటే చిన్నచూపు, పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే కర్కషంగా అబార్షన్ చేయించే రోజులు ఇవి. వారిని చదివించడమే ఎక్కువ అలాంటిది వారిని ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎవరు చేస్తారు? క్రీడాకారులను సరైన విధంగా గౌరవించుకోకుంటే రేపటి తరం ఎలా ముందుకొస్తారు..? ఎప్పుడు చదువు, ర్యాంకులు అని మానసిక హింసపెట్టి చదివించే తల్లిదండ్రులు టీచర్స్ ఉన్న ఈరోజుల్లో, స్కూల్స్ కాలేజీలలో కనీసం ఆటస్థలమే లేని ఈరోజుల్లో మారుమూల పల్లెటూరు నుండి మహిళా క్రీడకారులు ఎలా ముందుకొస్తారు? ఇప్పుడంటే గోపిచంద్ లాంటి కోచ్ ఆద్వర్యంలో, ఇంటర్ నేషనల్ లెవల్ లో స్టేడియాలు ఉండడం వల్ల అలాంటి పతకాలు రాబట్టవచ్చు కాని శైలజ పూజారి మాత్రం పల్లెటూరిలో పుట్టి చిన్న చిన్న స్టేడియంలో ప్రాక్టిస్ చేస్తూ దాదాపు అన్ని స్వర్ణపతకాలు గెలుచుకుంది.. ఇంతటి గొప్ప క్రీడాకారిని పరిస్థితే ఇలా ఉంటే ఇక మాములు క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు! శైలజ పరిస్థితి ఇన్ని సంవత్సరాలు కాకుండా ఇప్పుడు మనకు ఎలా తెలిసింది అంటే పి.వి సింధూ గారికి బహుమాణాలు మరి శైలజ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో మీడియా చొరవతో శైలజ పూజారి వ్యధ బయటి ప్రపంచానికి తెలిసింది. నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇలాంటి పరిస్థితి మరే ఇతరులకు జరగకూడదని కోరుకుందాం.. కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది తనకు రావాల్సిన అన్ని బహుమానాలు అందిస్తామని.. కాని అవ్వికూడా ఎన్ని రోజులు పడుతుందో..? అది కూడా చూద్దాం..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.