Contributed by Krishna Prasad
పశ్చిమగోదావరి ( West Godavari ), మన అందరికీ బాగా తెలిసిన, మనలోని చాలా మందికి, ఒక్క ముక్కలో చెప్పాలంటే మన అందరికీ కూడా మంచి అనుబంధం ఉన్న జిల్లా. ఎటు చూసినా కనిపించే పచ్చని చేలు, పాలకొల్లు లోని కొబ్బరి చెట్లు, భీమవరం చేపల చెరువులు, పండగప్పుడు వేసే కోడి పందాలు, కొల్లేరు అందాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సోయగాలు పశ్చిమ సొంతం.
ఏ కల్మషం లేని ఆప్యాయంగా పలకరించే మనుషులు, స్వచ్చమైన వాళ్ల మనసులు, ఇంటికి వెళితే పంచ బక్ష పరవన్నాలు పెట్టే వాళ్ల పెద్ద చెయ్యి. ఇలా మనకి ప.గో జిల్లా అంటే వెంటనే గుర్తొచ్చే విషయాలు.
ఇక దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటిన ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినిమా డైరెక్టర్ లు ఇలా చాలా మందికి పురిటి గడ్డ ఈ జిల్లా.
మామూలు సమయం లోనే ఎంతో ఆహ్లాదంగా ఉండే ఇక్కటి ప్రకృతి, శీతాకాలంలో మరింత రెట్టింపు అందంగా, ఆహ్లదకరంగా ఉంటుంది. ఇక మనం ఈ పశ్చిమ గోదావరి లో చూడవలసిన కొన్ని ముఖ్య ప్రదేశాలను చూద్దాం...
1. వేంకటేశ్వర స్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల ( చిన్న తిరుపతి )

2. కొల్లేరు

3. మావుళ్ళమ్మ దేవాలయం, భీమవరం.

4. నిర్మలగిరి చర్చ్, గౌరీ పట్నం.

5. గుంటుపల్లి బౌధ్ధ గుహలు, కామవరపుకోట.

6. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ( క్షీరా రామం), పాలకొల్లు.

7. సోమేశ్వర స్వామి ఆలయం ( సోమారామం ), గునుపూడి, భీమవరం.

8. బుద్ధ విగ్రహం ( 74 అడుగులు ) ఏలూరు.

9. పేరు పాలెం బీచ్

10. కొవ్వూరు గోష్పాద క్షేత్రం

11. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం, బుట్టాయగూడెం.

12. మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, జంగారెడ్డిగూడెం.

13. పాపి కొండలు
