Contributed by Masthan Vali
Date, Time గుర్తు లేవు. బహుశా మ్యాట్నీ షో అనుకుంటా. థియేటర్ లో అరుపులు, కేకలు,ఈలలు... గోల గోలగా ఉన్నా చాలా బాగుంది. సినిమా మొదలయ్యింది. టైటిల్స్ పడటానికి ముందు ఓ ఐదు-పది నిమిషాల నిడివున్న సన్నివేశాలు కొన్ని. రెండు కుటుంబాల మధ్య రగిలే పగలు-ప్రతీకారాలు, ఆ గొడవల్లో చనిపోయిన ఊరి మంచి కోరే ఇంటి మగాళ్లు. ఒక్క మగాడు కూడా మిగలకుండా అందరు " ప్రజల కోసం చంపబడ్డారు! " అప్పుడు ఆ ఇంటి ముసలావిడ ఇన్నాళ్లు గుంపులో సహచరులుగా ఉన్నవారిలో ఒక్కర్ని, ఎవరైనా ఒక్కర్ని వచ్చి " నాయకత్వం " వహించమంటుంది. కానీ ఎవ్వరు ధైర్యం చెయ్యబోరు. వీరి కోసం తమ వంశం లోని అందరు చనిపోయినా, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో విచారపడుతుందా ముసలావిడ.

ఆ తర్వాతా ఒక డైలాగ్ వినిపిస్తుంది. " నేనున్నానే నాయనమ్మ " అని. అంతే, Goosebumps అంటే ఏంటో మొదటి సారి ఫీల్ అయ్యాను. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన మనవడు slow motion లో స్కూల్ బ్యాగ్ ను పక్కకు విసిరేసి,స్కూల్ యూనిఫామ్ లో అదే slow motion లో నడుచుకుంటూ వస్తుంటే, ఆ ముసలావిడ ఒకింత ఉద్వేగంతో, ఒకింత గర్వంతో... పొడవాటి కత్తిని ఆ పిల్లాడి వైపు విసిరేస్తుంది. మర్చిపోయాను, ఆ పాటికే BGM మొదలయ్యింది. slow motion లో నడిచొస్తున్న ఆ బుడ్డోడు కత్తిని అందుకోగానే సీన్ ఫ్రీజ్ అవుతుంది. "సి.ధర్మరాజు సమర్పించు" అని స్క్రీన్ పై పడుతుంది. అలా నడుచుకుంటూ వెళుతుండగానే " వైజయంతి మూవీస్ " అని బ్యానర్ పేరు పడుతుంది. వెళ్లి కుర్చీపై కూర్చునే ముందు ఒకచేత్తో కత్తిని పట్టుకుని మరో చేత్తో తొడ కొడతాడా బుడ్డోడు. మళ్ళీ సీన్ ఫ్రీజ్, ఆ వెంటనే మ్యూజిక్ లో ఒక్కసారిగా Transition అవ్వడం, నాకు Goosebumps రెట్టింపు అవ్వడం ఒకేసారి జరిగాయి. తొడ కొట్టగానే మెరుపులు... ఆ మెరుపుల్లోంచి ఒక పేరు " మెగా స్టార్ట్ చిరంజీవి " అని. దీనమ్మ జీవితం, టాప్ లేచి పోవడం అంటే ఏంటో కూడా అప్పుడే మొదటి సారి తెలిసొచ్చింది నాకు.

ఆ పేరు పడ్డప్పుడు ప్రేక్షకులు స్పందించిన తీరుకు, థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆ ప్రభావం అలా కొనసాగుంతుండగానే... బుడ్డోడు కుర్చీలో కాలిపై కాలు వేసుకుని, ఒక చేత్తో కత్తిని పట్టుకుని, మరో చేతిని కుర్చీ పై ఉంచి ఠీవీగా కూర్చుంటాడు.ఆ బుడ్డోడి పేరుతో చుట్టూ ఉన్న వాళ్లంతా జై కొడుతుంటారు. రాజసాన్ని, కసినీ మిళితం చేస్తూ ఒక చూపు చూస్తాడు. ఆ చూపు close up అవుతుండగా BGM లో సినిమా టైటిల్ వినబడుతుంది, స్క్రీన్ పైన ఆ చూపులంత పవర్ ఫుల్ టైటిల్ పడుతుంది. అదేంటో నేను చెప్పక్కర్లేదు.

నేను సినిమాలో తర్వాత వస్తున్నఏ సీన్లను పట్టించుకోలేదు చాలాసేపటి వరకు. నా మైండ్ అంతా ఎన్నో రెట్లు హీరోయిజాన్ని, elevation ని చూసిన ట్రాన్స్ నుంచి బయటకు రావట్లేదు. అసలు ఒక హీరోని చూపించకుండా, చిరంజీవిని చూపించకుండానే... కేవలం తన పేరు తెరపై పడ్డప్పుడు ఆ పిల్లాడినే చిరంజీవి అనుకుని పూనకాలు వచ్చినట్టు అరవడం ఏదైతే ఉందో, అగ్గది " ఒరిజినల్ మాస్ " అంటే. మాస్ అని ఆ scene ని ఒక set of audience కి పరిమితం చేయలేము. మాస్,క్లాస్ అని తేడా తెలియని వయసులో చుసాన్నేను ఆ సినిమాని. అందరిలా గట్టిగా అరవట్లేదు. నోరు వెళ్ళబెట్టుకుని కళ్ళార్పకుండా చూడటం నాకు గుర్తుంది
ఈ సీన్ ఇంత Impact Create చేయడానికి గల కొని కారణాలను పరిశీలిస్తే... 1. చిన్న చిరంజీవిగా కనిపించిన తేజ! "ఇంద్ర" పాత్రలోని పౌరుషాన్ని, గాంభీర్యతను, కసిని... అన్నిటికి మించి మిగిలిన అన్నల్లాగా సంధికొచ్చిన పోలీసుకి దండం కూడా పెట్టని ఆ Attitude ని... ఉన్న కాస్తంత సేపు తన Screen Presence లో ఇప్పటికి గుర్తుండిపోయేలా నటించాడు. ఆ వయసులో పిల్లాడికి convey చేసి తనతో ఆ performance రాబట్టుకోవడం, బి.గోపాల్ & టీం కి Hats off ! 2. ఎంత మాస్ హీరో అయినా, ఎంత తోపు స్టార్ అయినా... ఒక elevation అద్భుతంగా పడాలంటే, దానికి ముందు ఒక గొప్ప emotion, ప్రేక్షకులను సినిమాలో విలీనం చేసుండాలి. బహుశా రెండు వర్గాల మధ్యన వైరం, పెళ్లయిన వెంటనే జరిగిన మోసం... ప్రేక్షకులకు ఒక Savior వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ను create చేసుంటాయ్. దాన్ని ఇంకొంచెం బలపరుస్తూ, బాధ్యతను తీసుకోడానికి ఎవ్వరు ముందుకురాని తరుణంలో వస్తుందా డైలాగ్... " నేనున్నానే నాయనమ్మా " అని. ఈ Establishment Scenes రాసిన పరుచూరి బ్రదర్స్ & టీం కి దండాలు. 3. చిరంజీవి - అదేంటి చిరంజీవెక్కడున్నాడా సీన్ లో అని ఎవ్వరు అడగరని నాకు తెల్సు. Content ఉన్నోడికి Cutout చాలంటారుగా, " మెగాస్టార్ చిరంజీవి " - ఈ పేరొక్కొటి చాలు. 4. ఎదో points లా చెప్తున్నా కాబట్టి ఇక్కడ 4 అని Mention చేసాను కానీ, ఇది మాత్రం నా All Time Favourite - మణిశర్మ. ఒక్కసారి ఆ సీన్ play చేసి అందులో వచ్చే BGM ని feel అవ్వండి. I Know, Play చెయ్యకుండానే మీ మైండ్ లో ఈ పాటికే రన్ అవుతోందని. ముఖ్యంగా, " Mega Star Chiranjeevi " అని స్క్రీన్ పై పడగానే వచ్చే Music Transition ఏదైతే ఉందో, yes... ఇది కదా మనక్కావలసిన emotion...! కొత్తగా చెప్పేదేం లేదు... That's మణిశర్మ forever.
ఈ సినిమా చూసి ఇంటికెళ్ళాక, సినిమా ఎలా ఉంది అని అడగని వాళ్ళకి కూడా అదేపనిగా నేను చెప్పిన సీన్ ఇది. "ఒక పిల్లాడొస్తాడు, తొడకొడ్తాడు, మెరుపులొస్తాయాయ్, ఆ మెరుపుల్లోంచి చిరంజీవి అని పడ్తుంది" అని! నాకు తెలీకుండానే నేనిచ్చిన First Narration! T.V లో ఎప్పుడు ఈ సినిమా వచ్చినా, Title scene చూస్తున్నప్పుడు నేను చెప్పిన narration గుర్తొస్తుందట మా ఇంట్లో అందరికి, అలా నేను వాళ్ళమీద ఇంపాక్ట్ create చెసేంత impact నాపై Create చేసింది ఆ సీన్. సినిమాకి నన్ను మరింత దగ్గర చేసిందని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పగలను.
ఒక మాస్ సీన్ అంటే ఇలా ఉండాలి అని బి.గోపాల్ గారు చాలా సార్లు తన సినిమాలో చూపించారు.. వాటిలో ఇంకొన్ని
సమార సింహ రెడ్డి మొదటి భాగం అన్న చెల్లెల అనుబంధం తో సాగే కథ, తరువాతి భాగం లో సమారసింహా రెడ్డి అనే అగ్గి రాజేస్కుంటుంది.. ట్రైన్ ఎక్కి విలన్ మీద పట్టుకుని బాలయ్య బెదిరించే సీన్, గొడ్డలి పట్టుకుని నీ ఇంటికొచ్చా అనే సీన్ కి విజిల్స్ పడుతుంటే వాటి మధ్య సినిమా ఉంది నా సామి రంగా...
నరసింహ నాయుడు ట్రైన్ నుండి బాల కృష్ణ దిగాడు, సినిమా టెంపో ని ఇంకో లెవెల్ కి లేపాడు.. అక్కడనుండి మొదలవుతుంది rampage.. "కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా" అనే డైలాగ్ ఇప్పటికి మర్చిపోలేను..
ఇంకా థియేటర్ నుండి బయటకి వచ్చిన, మైండ్ లో నుండి బాయటకి రాని సీన్స్ ఎన్నో, వాటిని అవి మనకి చూపించిన వారిని మెల్లగా ఒక్కొక్కరిగా గుర్తుచేసుకుందాం.. Thank you B.Gopal garu for this Mass..