మానవులకి దానవులకి జరుగుతున్న పోరాటం లో నిద్ర పోతున్న మానవ జాతి ని మేలుకొలపడానికి శ్రీ శ్రీ తన కలానికి పదును పెడుతున్న సమయం లో వెన్నెల ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లింది.
“నవీన విశ విద్యాలయాల్లో పురాణ కవితంలాగా, శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చావే వెన్నెలా?” అని అడిగారు.
“వినబడలేదా నడుం బిగించి కదం తొక్కుతున్న ఆంధ్ర యువత విప్లవ భావాల విపంచి గీతికలు? వాళ్లకేమీ చెప్పేది లేదా?” అని అడిగింది
“వినిపించాయ్ వినిపించాయ్ ... ఎవడో చెబితే వినే రోజులు ఏ నాడో వెళ్లిపోయాయి. ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఉబలాటం? అసలు నిజం ఏమిటంటే ఎవడికీ ఏమీ తెలియదు ఇలా ఎందుకొచ్చామో ఇక్కడెంత సేపుంటామో ఇక్కడి నుంచి వెళ్ళేదేక్కడికో ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో ఎవడూ చెప్పలేడంటే నమ్మండి. చెబితే మాత్రం నమ్మండి! కాళ్ళ క్రింద భూమి కరిగిపోతున్నప్పుడు పూరమ్ వేసిన పునాదులు కదిలిపోతున్నప్పుడు మనిషి కీ మనిషి కీ మద్య మాయ పొరలు కమ్మినప్పుడు మనసు కీ మనసుకీ మద్య మంచు తెరలు కమ్మినప్పుడుఏ నక్షత్రానికి తగిలించాలి ఈ మన విషాద శకటాన్ని? ఇక్కడ మా భరత వర్షం లో ఎక్కువగా కబుర్లే గానీ సమాజ సరూపం మార్చే సాహసం కనిపించకుండా ఉంది. మొన్ననే ఆంధ్ర రాష్ట్రం పుట్టిన రోజు పండుగ చేసుకుంది. పాతిక నెలల అభ్యుదయం పర్యాలోకనం చేసుకుంది.. రెండేళ్లలో ఏమవుతుంది ఇంకా కొన్నాళ్ళాగమంది కేంద్రం. చెల్లా చెదలైన తెలుగు వారందరూ తెల్లబోయి చూశారు!”
“అవునా? భూమ్మీద తిరిగే తారా నక్షత్రాలే యువతరానికి ధన్ను నిలిచాయా? ప్రాంతం, కులం, అభిమానానికి అతీతమా వీరి పోరాటం ?”
“అవును.. విసిగి వేసారిన యువతరానికి సుఖం ఎక్కడ? పోరాటమే కదా ఆస్కారం!” అంది వెన్నెల
“ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీ వన్నది, నీ వన్నది, నీ వన్నది, నీ వన్నది నిజం, నిజం! లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో! బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా! వృధా, వృధా! మనమంతా బానిసలం, గానుగలం, పీనుగులం! వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా, దగా! మనదీ ఒక బ్రదుకేనా? కుక్కలవలె, నక్కలవలె! మనదీ ఒక బ్రదుకేనా? సందులలో పందులవలె! నిజం సుమీ, నిజం సుమీ, నీ వన్నది నిజం సుమీ, బ్రతుకు ఛాయా, చదువు మాయ, కవిత కరక్కాయ సుమీ!
“సరే అయితే! వింటానంటే మాత్రం నా మాటగా చెప్పు ఎదురు చూస్తున్న యువతరానికి!”
వెర్రివాడా! కుర్రవాడా! క్షమిస్తావా! సహిస్తావా! బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని!
అహింస ఒక ఆశయమే కాని ఆయుధం ఎప్పుడూ కాదు ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే మరి ఆశయం ఉండటం మంచిదే కాని అన్ని ఆశయాలూ మంచివి కావు ఆశయాలు సంఘర్షంచే వేల ఆయుధం అలీనం కాదు అందుకే అంటున్నాను నేను అందుకో అయుధం అని ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్దకమవుతుంది అందుకే సృష్టిస్తున్నాను ఆధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది జనంతొ నిర్మిస్తున్నసర్గం ఇది ఏరా కుర్రాళ్లూ.. నడుం బిగించి కదం తొక్కుతున్నారని విన్నాను.. వినిపించాయ్ వినిపించాయ్ మీ విప్లవ భావాల విపంచి గీతికలు...
నడూ నడూ: భయం గియమ్ విడు!
విరోధించు వారు లేరు లే
నిరోధించువారు లేరులే
ఆస్తి నాస్తి భేదమేలరా?
వాస్తవం వరించి సాగరా:
విశాలాంధ్ర లో ప్రజా రాజ్యమే
ఘటించగా శ్రమించరా పరాక్రమించరా!
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ __
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటినీ దాటండి!
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులు మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి!
ఎముకలు క్రుళ్లిన,
వయస్సు మళ్లిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
“ హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా! “ అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హొరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకా భ్రముల ప్రళయగోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు !
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జల ప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరా వలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!
త్రాచుల వలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా
మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హొమ జ్వాలల భుగ భుగలు?
యువతా.. పోరాడు.. భయపడకు.. నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుంది లే!