కౌమార గీతి: The Youth song
చిన్నప్పుడు మనకుండే అమాయకత్వం కంటే , ఇంటర్మీడియట్ లో హాస్టల్ గోడ దూకి సినిమాలకి తిరిగేటప్పుడు , పక్కనే ఉన్న అమ్మాయిల హాస్టల్ లో అమ్మాయిల కోసం extra కటింగ్లు కొట్టేటప్పుడూ ఉన్న అమాయకత్వం Intense . ఆ అమాయకత్వాన్ని , తెలిసీ తెలియని తనాన్ని explore చేస్తూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం లోని శైశవ గీతి స్టయిల్ లో రాసిన ఈ కౌమార గీతి కుర్రకుంకలందరికీ అంకితం ! ఇంతకీ కౌమారమంటే Youth అని అర్ధం .
శ్రీ రంగం శ్రీనివాసరావు aka శ్రీ శ్రీ , మా ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారి ద్వారా నాకు పరిచయమైన సాహిత్య విప్లవం ! శ్రీ శ్రీ ని మా ప్రొఫెసర్ చదువుకునేటప్పుడు వాళ్ళ కాలేజీ ఫెస్ట్ కి invite చేసి కలిశానని చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసిన మెరుపు , ముంబై IIT హాస్టల్ లో మహా ప్రస్థానం పుస్తకం మా పంచ్ మణి గాడికి చదివి వినిపిస్తూ అర్దాలు చెప్తుంటే వాడి కళ్ళల్లో చూసిన మెరుపు , ఎన్ని సార్లు చదివినా Goosebumps అనే పదానికి స్పెల్లింగ్ రాయించే ఆ సాహిత్యం వల్ల వచ్చిన మెరుపు ఇప్పుడు ఇది రాయడానికి నాకు Biggest Inspirations .
తప్పులుంటే మన్నించండి , అసలు అర్ధమే లేదనుకుంటే క్షమించండి, ఇక చదివి తరించండి :P
పాపం , పుణ్యం , ప్రపంచ మార్గం ..
మాట్లాడుకునే మాటలు కాని ,
బూతులు తప్పా మాటలు రాని ,
అపుడే ఎదిగిన పిల్లల్లారా ,
మీసాలొచ్చిన కుర్రోళ్ళారా !
తను పక్కకి తిరిగి నవ్వు నవ్వినా ,
నలకే పడి తను కన్ను గీటినా ,
Fb లో లైక్ కొట్టినా ,
Whatsapp లో స్టేటస్ మార్చినా ,
అవి మీకేనేమో ప్రేమే అనుకుని పండగ చేసే పిచ్చోళ్ళారా ,
ఎదిగీ ఎదగని బచ్చాళ్ళారా !
అచ్చటికిచ్చటి కనుకోకుండా ,
థియేటర్లకి ఎగురుతుపోయే ,
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే ,
సినిమా ప్రేమిక కుర్రోళ్ళారా ,
పిట్టల్లాంటి పిల్లోళ్ళారా ,
చదువే మరిచిన చిన్నోళ్ళారా !
రేపేంటో తెలియని అయోమయం లో ,
అంతా నాదే అనే అమాయకత్వం లో ,
ఆదివారం ఆటల్లోనూ ,
Coffee day ల్లో , KFC ల్లో ,
మాటలు మరిచే ప్రేమలలోనూ ,
ప్రాణాలిచ్చే స్నేహాల్లోనూ ,
మార్కుల్లోనూ , వార్తల్లోనూ ,
గొడవల్లోనూ , గోలల్లోనూ ,
మనుషుల్లోనూ , మనసుల్లోనూ ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై ,
విశ్వరూపమున విహరిస్తుండే చిరుతల్లారా ,
జగతిని నడిపే జగన్నాధ రథ చక్రాళ్ళారా ,
మీదే మీదే అనంత విశ్వం , కాదా మీకు సమంత సొంతం ! :D