మహాత్మగాంధీ గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో ఉండగా కొంతమంది రైతులు వారికున్న సమస్యకు పరిష్కారం కోసం అక్కడికి వచ్చారు. వారి పొలాల్లొ వేసిన మొక్కజొన్న పంటలో కోతుల బెడద ఎక్కువగా ఉందని దాని విషయంలో సరైన పరిష్కారం చూపించాలని వేడుకున్నారు. సాదారణంగా హిందువులు కోతులను హనుమాన్ స్వరూపంగా పరిగణిస్తారు ఇంకా అక్కడి ఆనాటి కాలంలో ఎక్కువ. బాపు వారితో... మీరు బాణాసంచా(Crackers), డప్పులధ్వని(DrumSound) తో వాటిని భయపెట్టిండి అని అన్నారు. వారు వెళ్ళి అదే పని చేశారు మెదటిరోజు కోతులు పారిపోయాయి, తర్వాత మళ్ళి వచ్చి అలాగే చేస్తుండటంతో మహాత్ముడు వాటిని కర్రలతో తరిమికొట్టండి అని సలహా ఇచ్చాడు కోతులు రెండొ రోజు కూడా పారిపోయాయి.
కాని ఈసారి మూడవరోజు మాత్రం రెట్టించిన కోపంతో రైతులు కొడుకులా పెంచిన పంటనంతా చిందర వందరగా ఏదో గొడవకు దిగినట్టుగా నాశనం చేయసాగాయి, వాటిని కొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా కరవడం మొదలుపెట్టాయి. వారి ఇళ్ళమీదకు వచ్చి మరి దాడిచేశాయి. రైతులకు ఏం చేయాలో అర్ధంకాక ఆశ్రమానికి వెళ్ళారు... మహాత్మ గాంధీ ప్రశాంతంగా శ్రీరామాయణం చదువుతూ ఉన్నాడు.... రైతులు జరిగినదంతా చెప్పారు గాంధీజీ ఇంకోమాట మాట్లాడకుండా "వాటిని చంపేయండి" అని చెప్పాడు. రక్తపు గాయాలతో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో అదేంటి బాపు అహింసా మార్గంలో స్వతంత్రపోరాటం చేస్తున్న మీరు ఇలా ఒక ప్రాణిని చంపేయమని అంటున్నారెంటి అని ఆశ్ఛర్యంగా అడిగారు...
అప్పుడు బాపు... మనమేమి వాటి స్థావరాల దగ్గరికి వెళ్ళలేదు వాటినేం హింసించలేదు, అవ్వే మన దగ్గరికి వచ్చి మన పిల్లలకోసం, మన బతుకుకోసం పండిస్తున్న మన పంటను మన ఆహారాన్ని నాశనం చేస్తున్నాయి పరోక్షంగా అవి మన ప్రాణాన్ని తీస్తున్నాయి... చెప్పి చూసాం, కొట్టి చూపించిన కూడ మన ఇళ్ళల్లోకి వచ్చి ఇలా రక్తం వచ్చేలా దాడి చేస్తుంటే మనం అహింసాఅనే అవసరంలేదు, మీరు ఈరోజు కొట్టిన అవి రేపు కూడ వస్తాయి
మళ్ళి ఇలాగే దాడిచేస్తాయి మన సహనాన్ని అవి మన చేతగాని తనంగా భావిస్తున్నాయి వెళ్ళి చంపేసి మీ పిల్లలను హస్పిటల్ కు తీసుకువెళండి అని అన్నారు మహాత్ముడు.