Article Info Source: Eenadu
ఈరోజుల్లో ఒక్క రోజు పవర్ లేకుంటే ప్రపంచం స్థంభించిపోతుంది. అలాగే కరెంట్ బిల్ చూడగానే మనం కూడా స్థంభించిపోతున్నామనుకోండి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడో ఉన్న సూర్యునితో, కాస్త పెట్టుబడితో ఉచితంగా పవర్ తయారుచేసుకునే ఆధునిక ప్రపంచంలోకి మనం చేరుకున్నాం. ప్రకృతి మనకు అమ్మలా అన్ని ఇచ్చింది. గాలి, నీరు, నిప్పు, చెట్లు, ఐరన్ లాంటి ఖనిజాలతో పాటు ప్రతి ఒక్క అవసరం కోసం మనం ప్రకృతి మీదనే ఆధారపడుతున్నాం. ఏదైనా తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిని సరిగ్గా ఉపయోగించడం కూడా తెలియాలి. అలా తెలుసుకుని, శ్రమపడి తను ఉపాధి పొందడమే కాక ప్రజలకు, వాతావరణానికి కూడా ఎంతో మేలుచేస్తు, తనదైన శైలిలో ప్రత్యేక దారిని నిర్మించుకుని సోలార్ సంస్థతో దుసుకుపోతున్నారు "సవితా సాయి".
$nbsp;సవితా సాయి చదువుల్లో అవరేజ్ స్టూడెంట్. అందరిలాగా ఉండాలని చాలామందికి అనిపించవచ్చు కాని కొందరికి మాత్రం అలా ఉండటం అస్సలు నచ్చదు.. ఆ ప్రత్యేకమైన వ్యక్తిత్వమే సమాజంలో గుర్తింపును తీసుకువస్తుంది.. అలా అనుకునే బి.టెక్ చదువును ఆపేసి తనకెంతో ఇష్టమైన వ్యాపార రంగంలో రాణించాలన్న కాంక్షతో అమిటీ యూనివర్సిటీలో బీ.బీ.ఏ కోర్సులో జాయిన్ అయ్యారు.
$nbsp;సవితా తన ప్రతి ఒక్క అడుగు ఒక ప్రణాళిక ప్రకారం వేశారు. తను నడుస్తున్న దారి, అందుకోసం వేసే అడుగులు తన లక్ష్యానికే అని తపన పడ్డారు. సవిత ఒక పక్క చదువుకుంటునే బిజినెస్ లో మెళకువలు తెలుసుకోవడానికి మరోపక్క ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేసేవారు. ఈ క్రమంలోనే "సోలార్ పవర్" తనని ఆకర్షించింది. ఈ సంస్థను స్థాపించడానికి వీటి మీద విశేష పరిజ్ఞాణం ఉండాలని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇన్వెర్టర్ మానుఫాక్టరింగ్ కంపెనీలో ఇంటర్న్ షిప్ కి చేరిపోయారు. ఆ సంస్థలో పనిచేయడం మూలంగా, దేశ విదేశాలలోని వివిధ సోలార్ పవర్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడటం మూలంగ అమూల్యమైన అనుభవం సంపాదించుకున్నారు. ఆ అనుభవంతోనే "Rays Solar Technologies" ను సవితా స్థాపించారు.
$nbsp;మంచి మార్కెట్ ఉన్న బిజినెస్ కానివ్వండి లేదంటే అప్పుడే కొత్తగా ప్రారంభించిన బిజినెస్ కానివ్వండి ఎక్కడైన కాంపిటీషన్, సమస్యలు తప్పనిసరిగ ఉంటాయి. సవితా సాయి వాటిని సమర్ధంగా ఎదుర్కున్నారు. మిగిలిన వారికన్నా తక్కువ ధరకే గృహ అవసరాలకు, కంపెనీలకు నాణ్యంగ అందించడంతో సంస్థపై వినియోగదారులకు నమ్మకం ఏర్పడి వారి నోటి మాటే పెద్ద పబ్లిసిటి అయ్యింది. అలా ఒక్క సంవత్సరంలోనే కోటి రూపాయల టర్నోవర్ అందుకున్నారు. సాధారణ కరెంట్ తో పనిచేసే 30 రకాల వస్తువులు ఈ సోలార్ పవర్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారుని ఇంటికి వచ్చి డాబా మీద సోలర్ పరికరాలను ప్రదేశానికి అనుగూనంగా భిగిస్తారు. సోలార్ పవర్ కోసం పెట్టుబడికి డబ్బు ఖర్చుపెట్టినా, తర్వాత విద్యుత్ బిల్ పై అనవసర ఖర్చు పెట్టనవసరం ఉండదు. ఒక్క ఇంటి అవసరాలకే కాకుండా రైతుల కోసం కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. పొలానికి అవసరమయ్యే నీటిని సోలార్ పవర్ సహాయంతో పంటలకు అందించవచ్చు.
$nbsp;Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.