జైలు అనేది ఖైదీలను శిక్షించే బందిఖాన అని కాకుండా వారిని ఉన్నతంగా మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే ఒక పాఠశాలలా ఉండాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీల ద్వారా పెట్రోల్ బంక్ ను నడిపిస్తున్నారు. "మహా పరివర్తన్ "పేరుతో చేస్తున్న కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి. తెలంగాణ జైళ్ళ శాఖ అధికారి సింగ్ ఆద్వర్యంలో ప్రత్యేకంగా కొంత మంది మహిళా ఖైదీలను, ఇంకా శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలను ఎంపిక చేసి ఈ పెట్రోల్ బంక్ ను స్టార్ట్ చేశారు. వారికి 12,000 Salary కూడా ఇస్తున్నారు.
మామూలుగా ఉద్యోగం దొరకడం కాస్త కష్టంగానే ఉంటుంది అది కూడా నేరం చేసి జైలుకి వెళ్ళివచ్చిన ఖైదీలు అంటే మరింత కష్టం. ఈ కష్టాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు ఖైదీలనే కాకుండా, విడుదలైన ఖైదీలను ఎంపిక చేసి దాదాపు 25 మంది మహిళలకు ఇందులో ఉద్యోగం అందించారు. ముందు జైలు అధికారులు మాజీ ఖైదీలను బయటి కంపెనీలలో ఉద్యోగం ఇప్పించారు కాని అక్కడ కేవలం 5,000 కు మించి జీతం ఇవ్వకపోవడంతో మాజీ మహిళా ఖైదీలకు చాలా ఇబ్బంది ఉండేది ఇలా కాదు మనమే ఎదైనా ప్రారంభించి దాని ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేస్తూ ఖైదీలకు, మాజీ ఖైదీలకు ఉద్యోగం ఇచ్చి వారిని న్యాయపరమైన దారిలో నడిపిస్తున్నారు.
ఒకరు తప్పు చేస్తే చాలు వారు సమాజంలో ఉండకూడదు అని దూరంగా ఉంచుతూ, వారితో మాట్లాడకుండా సాంఘీకంగా వెలివేస్తుంటారు చాలామంది.. అలా కాకుండా వారిలో పరివర్తన కలిగించి కొత్త జీవితానికి సహాయం చేయడం అనేది నిజమైన మానవత్వానికి ప్రతీక.