"మానవుల చర్యల వల్ల వచ్చిన కార్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించాలంటే భూమిపై ఉన్న మూడు ఖండాలు మొత్తం అడవులు పెంచినా కానీ తగ్గే పరిస్థితిలో లేమంటే మనం వినాశననికి ఎంత దగ్గరగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి".
మీకో విషయం తెలుసా.. పది రూపాయలు పెట్టి కొనే చిప్స్ ప్యాకెట్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. మాములు ప్లాస్టిక్ అయినా రీసైకిల్ చెయ్యొచ్చు కానీ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని చేయలేము. అలాంటి ప్లాస్టిక్ మన భూమి మీద ఇప్పటికి వేల టన్నులలో ఉంది(ఇంకా ప్రతిరోజు ఉత్పత్తి జరుగుతూనే ఉంది.) అంతెందుకండి మనం ఇంట్లో భగవంతుని ముందు వెలిగించే అగరబత్తిలో కిరోసిన్ కలుపుతారు ఇవి ఎక్కువ కాలం వాడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజూ సాయంత్రం కాగానే మనం వెలిగించే మస్కిటో కాయిల్, రిఫైల్ చాలా హానికరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశం చుట్టూతా మనకు, పర్యావరణానికి హానీ కలిగించే వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇవే పద్ధతులు ఇలాగే కొనసాగితే కనుక సుమారు 20 సంవత్సరాల లోనే మనిషి బ్రతకడానికి వీలు లేని ప్రదేశంగా ఈ భూమి తయారుకాబోతుంది. అభివృద్ధి అంటే సౌకర్యాలు కాదు అభివృద్ధి అంటే ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం అన్న నినాదంతో "అనిల్, ఆదిత్య, వర్మ" ముగ్గురు మిత్రులు కలిసి గ్రీన్ మిట్టి(7093351666) ద్వారా "ఇప్పటి వాతావరణ పరిస్తితులకు అత్యంత అవసరమైన వస్తువులను రూపొందిస్తున్నారు".

"ఒకప్పటి మనిషికి ఇప్పటి మనిషికి చాలా తేడా ఉంది. ఆ కాలం మనిషి దుస్తులు ధరించాడు దానికి రంగు వేసుకున్నాడు. దానిని చెట్టు నుండి సేకరించాడు, దాని విత్తనాలు వాడి, డై కూడా వేసుకున్నాక ఆ విత్తనాల ద్వారా మళ్ళీ ఆ మొక్కల్ని పెంచాడు". ఇప్పుడు అసలు అలాంటి చెట్టు ఒకటుందని కూడా నేటి మనిషికి తెలియదు."
అనవసర వస్తువుల నుండి అవసరమైన వస్తువులుగా: ఒక ఇంటర్నేషనల్ జర్నల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 70% వరకు మనం అనవసరమైనవే వస్తువులనే తీసుకుంటున్నాము, మిగిలిన 30% మాత్రమే ఉపయోగకరమైన వాటిని కొంటున్నాము. 70%లో ఉన్న ఈ అనవరమైన ప్రోడక్ట్స్ కొన్ని రోజులయ్యాక చెత్తలోకి పోతుంది, ఈ 70%లో 50% ప్లాస్టికే!! ఈ రీసైకిల్ చేసే ప్రాసెస్ లో వస్తున్న ఆ వేస్ట్ లో 50% ప్లాస్టిక్ లో 20% కనుక తగ్గించగలిగితే మళ్ళీ ఈ 70% ప్రొడక్షన్ చెయ్యడానికి అవసరమైన న్యాచురల్ రీసోర్స్ ని మనం కొంతవరకు కాపాడగలిగినవారిమి అవుతాం. తద్వారా ప్రకృతికి చాలా మేలు జరుగుతుందన్నది ప్రయత్నం. ఒకవైపు నుండి వాటిని మనం ఎలా కాపాడుకోగలుగుతాం అన్న ప్రయత్నం నుండే ఇంకో వైపు నుండే ఉన్నవాటిని వాడుకుంటే కొత్తవి ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం మనకు ఉండదు.

"ఆరు సంవత్సరాల క్రితం మొదటి అంతస్తు వరకు వచ్చే దోమలు, ఇప్పుడు ఐదో అంతస్తు వరకు వస్తున్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేంజ్ లో ఉన్న కార్బన్ డిపాజిషన్ పెరుగుతుంది. దోమలు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ ఉన్న చోటుకే వెళతాయి".
స్కూల్స్, కాలేజీ విద్యార్థులే వీటిని తయారుచేసేది: ప్రతి సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం ఉంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, వస్తువు ఉపయోగకరమే.. కాకపోతే మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోతున్న వస్తువులన్నీ కూడా ఆదిత్య గారు దగ్గరుండి స్కూల్, కాలేజీ విద్యార్థుల ద్వారా తయారు చేయిస్తున్నారు. స్టూడెంట్స్ తయారు చేస్తుండడం వల్ల మొదటిగా అవగాహన పొందేది వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వీరిలో జ్ఞానం పెంచితే కనుక రేపటి తరానికి మనం ఎదుర్కుంటున్న వాతావరణ సమస్యలు తగ్గుతాయి.

"మస్కిటో కాయిల్స్, రిఫైల్ వాడే కన్నా మస్కిటో రీప్లేన్ట్ ప్లాంట్స్ అయిన బంతి, వాము, తులసి, సబ్జ మొదలైనవి ఇంట్లోనే పెంచుకోవచ్చు".
నైతిక, పర్యావరణ అభివృద్దే అసలైన అభివృద్ధి: సింపుల్ లాజిక్ అండి మనం నేచర్ కి, సాటి మనుషులకు ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం మంచిని ఇస్తే మంచి వస్తుంది, చులకనగా చూస్తే మనల్ని అలాగే చూస్తారు, మనం హానీ చేయాలనుకుంటే తిరిగి అదే మనకూ తిరిగివస్తుంది. అనిల్, వర్మ, ఆదిత్య గార్లు ఇలా మంచిని పంచుతూ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తులు. అనిల్ గారు Environmental Engineering లో Graduation చేశారు. అనిల్ ఇంకా వర్మ గారు ఈ-వేస్టేజ్ కోసం కలిసి పనిచేశారు. ఆదిత్య గారు 10 సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితులపై పరిశోధన చేస్తున్నారు. ఒక మంచి ఆశయం ఈ ముగ్గురిని కలిపింది.
గ్రీన్ మిట్టి ద్వారా సీడ్ బాల్ నుండి సీడ్ పెన్సిల్ వరకు ప్రతిదీ ఉపయోగకరమైనవి, ఇప్పటి పరిస్థితులకు అత్యంత అవసరమైనవి.
1. మట్టి గణపతులు(విత్తనాలతో)

2. దేశీయ విత్తనాలు(సీడ్ బ్యాంక్)

3.పునః వినియోగించిన అట్ట, అజీవ బీజాలతో జీవం పోసుకున్న కళ.

4. సీడ్ బాల్

5. సీడ్ రాఖీ

6. సీడీలతో తయారుచేసిన చెవి రంగులు

7. సీసా మూతలతో తయారుకాబడ్డ తేనెటీగ

8. పూలతో తయారుచేసిన అగరబత్తీలు.

9. అలంకరణ కోసం పాత గాజు సీసాలతో తయారుచేసిన వస్తువులు.

10. సీడ్ పెన్(వినియోగించిన పేపర్ తో తయారుకాబడినది)

11. సీడ్ పెన్సిల్ (ఈ పెన్సిల్ పడేసినా మొక్కగా మారుతుంది.

12. విత్తన జెండా

13. సముద్ర గవ్వలతో చెవి కమ్మలు.

14. పాత ఇయర్ ఫోన్స్ పారివెయ్యకుండా.

15. సీడ్ విజిటింగ్ కార్డు

16. పాత క్యాసెట్ తో ఇలా

17. బేసిల్ విత్తనాలతో దోమల నివారిణి
