Contributed by Sai Ram Nedunuri
భాష విస్మరించబడింది తనకింక విలువ లేదని విమర్శించబడింది ఘాఢాంధకారంలో కృంగిపోయింది అజ్ఞాతం వైపు నడిచింది కవితా లోకం యావత్తూ కన్నీరు కార్చింది కొండంత భాధని దిగమింగుకుని నైరాశ్యపు సంకెళ్ళు తెంచుకుని చమర్చిన చక్షువులు తుడుచుకుని ఖడ్గ సమానమైన కలం చేతబూనుకుని రచయితల సమూహం పూనుకుంది వారికి అక్షరం ఆసరానిచ్చింది పదం పాదం కలిపింది వాక్యం వంత పాడింది భావం బాసటగా నిలిచింది రచన రక్తి కట్టింది అటువంటి రచనలతో భాష ఉనికి తిరిగి చిగురించింది తేనెలొలికే తన మాధుర్యం అందరికీ తెలిసొచ్చింది తన మొఖంపై చిరునవ్వు వెల్లివిరిసింది భాష అజ్ఞాతం వీడింది మళ్ళీ అందలం ఎక్కింది