Contributed By Harika Potluri ఉండనీ లోకం ఎంత పెద్దదైనా.. ఉన్నారా మనకంటూ ఎవరైనా? జరగనీ ఎంత విషాదమైనా కదిలిందా మన మనసు ఎప్పుడైనా? ఓడనీ ఈ పోరాటంలో ఎన్నిసార్లైనా.. ఆపామా మన ప్రయత్నం ఎప్పుడైనా? వెయ్యనీ నిందలు ఎన్నైనా.. తెలియకుండా ఆగిందా నిజం ఎన్నడైనా? ఎదగనీ ఆ చెట్టు ఎంత పెద్దదైనా.. వదిలింద నేలను ఒక్క క్షణమైనా? ఎగరనీ గాలిపటం ఎంత ఎత్తు ఎగిరినా.. నిలిచిందా తీగని వదిలి ఒక్క గడియ అయినా? కలగనీ నొప్పి ఎంత కలిగినా.. వదిలిందా తల్లి కాన్పుని ఎక్కడైనా? రాలనీ కన్నీళ్ళు ఎంత రాలినా.. ఆలసిందా ఆ కన్ను ఎంత ఏడ్చినా? ఉండనీ కంఠం లో విషం ఎంత ఉన్నా.. మింగినాడే తప్ప, దిక్కరించాడా పరమశివుడైనా? మండనీ ఆ అగ్ని ఎంత మండినా.. ఆగిందా ఆ భానుడి తనువు ఎన్నడైనా? అడ్డు రానీ ఎన్ని కొండలైనా ఎన్ని లోయలైనా.. వదిలిందా ఆ నది సంద్రాన్ని ఎక్కడైనా? ఎదగనీ మనిషి ఎంత పెద్దవాడైనా.. జయించాడా చావు ని ఎక్కడైనా? ఉండనీ సామాజిక బేధాలు ఎన్ని ఉన్నా.. ఆపగల్గిందా అ మనిషి స్వార్ధాన్ని ఎంత సాధించినా? జరగనీ ఆ మూడో ప్రపంచ యుద్ధమైనా.. మారుతాడా మనిషి అప్పుడైనా? రాయనీ ఆ మనసు ఎంత రాసినా.. ఆగిందా ఆ కలం నీరసించినా? చదివినా నా రచనలు, ఎవ్వరు చదవక మరచినా.. వదులుతానా నా ప్రపంచమైన మీ అనుబంధాన్ని ఎప్పుడైనా? "లేదు" ఇదీ నా జవాబు ఏ ప్రశ్నకైనా...
This Writer's Note On Commitment Towards Her Passion Is Spot On
