Forget Marvel Vs DC Comics, Get Back To The Days Of Two Telugu Authors-Yaddanapudi Sulochana Rani Garu And Yandamoori Veerendranath Garu

Drawing parallels between Yandamuri and Yaddanapudi
Updated on
Forget Marvel Vs DC Comics, Get Back To The Days Of Two Telugu Authors-Yaddanapudi Sulochana Rani Garu And Yandamoori Veerendranath Garu

Contributed By Divya Vattikuti

యద్ధనపూడి సులోచన రాణి గారు మరియు యండమూరి వీరేంద్ర నాథ్ గారు ఇద్దరు తెలుగు సాహిత్యానికి చేసిన కృషి అంత ఇంత కాదు. ఈ ఇద్దరి రచన శైలిని విశ్లేషించే ప్రయత్నమే ఈ ఆర్టికల్.
వాస్తవికతకు కల్పికత్వానికి మధ్యలో ఉండేది చాలా చిన్న గీత. ఆ గీతను మరిచిపోయేలా రాయగలిగే రచయితలు ఎందరో. అలాంటి వారిలో యద్దనపూడి సులోచన రాణి, యండమూరి వీరేంద్రనాథ్ కి ప్రత్యేక గుర్తింపు. ఇద్దరు సామాజిక సంబంధిత రచనలతో యువతను కట్టిపడేసే వారు. తెలుగు నవల రచయితల్లో ఆడవాళ్ళందరూ యద్ధనపూడి గారి ఫాన్స్ అయితే అబ్బాయిలందరు యండమూరి ఫాన్స్ గా ఉన్న రోజులు అవి.
నవల రాణిగా యద్ధనపూడి గారికి గుర్తింపొస్తే, రచన రాక్షసుడు గా యండమూరి వీరేంద్రనాథ్ పేరు పొందారు. ఇద్దరి రచనలు సమకాలీన ఆలోచనలు, సమకాలీన సంబంధాలు చుట్టూనే తిరుగుతూ ఉన్నా , ఇద్దరి రచనాశైలి రెండు భిన్న విధానాల్లో ఉండేది. ఎలా అంటే , యండమూరి గారు ఆనందో బ్రహ్మ నవల లో కథను 2054 కు తీసుకువెళ్లి , అక్కడ నుంచి వంద సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చి, అబార్షన్ కు తండ్రి దగ్గర డబ్బులు అడిగే పెళ్లి కానీ కూతురు దగ్గర్నుంచి అనీర్వచనీయమైన ఆత్మేయ బంధం పెనవేసుకున్న సోమయాజులు మందాకినీ వరకు ఎన్నో విలక్షణమైన పాత్రలను ఒకే నవలలో కుర్హ్చారు యండమూరి. యద్దనవుడి గారు తన బంగారు కళలు అనే నవలలో సరోజ, రవి, శేషగిరి, చిదంబరం, పురుషోత్తం, రాజారావు ఇందరి మధ్య ఉండే పడుచు మనసుల పరవసాన్ని, యువ జీవితాల ఉత్సాహాన్ని, వాటితో పాటు ఉండే రాగద్వేషాలని ఎంతో అద్భుతంగా వర్ణించారు.
యద్దనపూడి గారు అప్పట్లోనే జాహ్నవి అనే నవలలో హోమోసెక్సువాలిటీ గురించి మాట్లాడితే, యండమూరి గారు క్లోనింగ్ లాంటి సైంటిఫిక్ టెక్నిక్స్ గురించి తన అష్టావక్ర అనే పుస్తకం లో రాసారు.
సెంటిమెంట్, ఆర్ద్రత, సస్పెన్సు , సైన్స్ ఫిక్షన్ యండమూరి గారి ముఖ్యమైన రచన శైలి కాగా, యెద్దనపూడి గారి పాత్రలు మాత్రం సున్నితమైన సంఘటనలు , జీవిత చక్రం లో ప్రేమ, ఆప్యాయత అను బంధాలతో చిక్కుకున్న పాత్రలు ఎలా ముందుకు సాగారు అనే ధోరణి లో ఉంటాయి. "చాలా దశాబ్దాలుగా, స్త్రీలు వారి అందం కోసం మాత్రమే వర్ణించబడ్డారు, కాని సులోచన రాణి నవలలు వారి వైఖరి మరియు వ్యక్తిత్వం కోసం వాటిని వర్ణించడం ప్రారంభించాయి.


Yaddanapudi Sulochana Rani :


ఆ తరం సమకాలీన పోకడలను తన నవలల్లో ప్రతిబింబించే లా రాయడం యద్దనపూడి గారి ప్రత్యేకత. మధ్య తరగతి మనస్తత్వాలు, ,మన చుట్టూ కనిపించే జీవితాలే ఆమె కథా వస్తువులు. ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే అమ్మాయిలే ఆవిడ నవలా నాయికలు. నవల చదువుతున్నంత సేపు మనసుకు హాయిగా, ఆహ్లాదంగా అందమైన ఊహ ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. కోడూరి కౌసల్య దేవి, మదిరెడ్డి సులోచన, రంగనాయకమ్మ, మాలతీ చందూర్ వంటి ప్రతిభావంతులైన రచయిత్రుల మధ్య తనదైన శైలి తో నవలాలోకాన్ని దశాబ్దాల పాటు యేలారు యద్దనపూడి గారు. ఆమె రాసిన ప్రతి పుస్తకము అమృతమే. అన్నిటికి మించి ఆమె రచన శైలి, పాత్రల వర్ణన పాఠకులను విపరీతంగా ఆకట్టుకునేది. అందుకే పాఠకులకి ఆమె పుస్తకం ఒక అందమైన అనుభవం. ఆమె రాసిన ప్రతి కథలో ప్రధానం గా స్త్రీ సమస్యలే కనిపిస్తాయి. దాని చుట్టూ ఒక ప్రేమ కథ అల్లుకుని ఉంటుంది. సమాజం లో స్త్రీకి ఒక లెక్క, పురుషునికి ఒక లెక్క అంటే ఆమె అసలు ఒప్పుకోరు. ఎవరి అహం దెబ్బతినకుండా పాత్రల ద్వారా దీనిని వర్ణించటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. మధ్య తరగతి అమ్మాయిలే లక్ష్యం గా ఆమె నవలలు రాసేవారని అప్పట్లో విమర్శలు కూడా ఉండేవి. సమాజం లో అమ్మాయిల వాస్తవ ఆలోచనలే కథలో పాత్రల ద్వారా చెబుతుంటా అని ఆమె అంటుండేవారు.

Yendamuri Veerendranath:


తెలుగు సాహిత్యంలో, యద్దనపూడి సులోచన రాణి వంటి మహిళా రచయితలు బాగా రాణిస్తున్నందున పురుషులకు చీకటి రోజులు ఉన్నాయి. ప్రచురణకర్తలు మహిళా రచయితలకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఇస్తుండేవారు, అలానే పాఠకులు కూడా మహిళా దృక్పధం లో రాసిన నవలలను చదవటానికి మక్కువ చూపేవారు. చాలా మంది రచయితలు ఆడ కలం పేర్లతో కథలు, నవలలు రాసేవారు. అటువంటి సమయం లో పాఠకులతో పాటు తోటి రచయితల యొక్క ఈ దృక్పధాన్నివిచ్ఛిన్నం చేస్తూ యండమూరి " తులసి దళం" అనే కథతో ఎటువంటి కలం పేర్లు ఉపయోగించకుండా ముందుకు వచ్చాడు. వెన్నెల్లో ఆడాపిల్లా, అంటర్ముఖం సహా 50 నవలలు రాశారు. ఆయన రచనలు తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ మరియు మరాఠీలోకి అనువదించబడ్డాయి. తన రచనలలో యండమూరి భారతదేశంలోని పేదరికం, పక్షపాతాలు మరియు మూడనమ్మకాలు వంటి అనేక సామాజిక సమస్యలను పేర్కొంటూ , సామాజిక బాధ్యత వహించామని ప్రజలను ప్రోత్సహిస్తారు.

మీకు నచ్చిన యద్ధనపూడి సులోచన రాణి గారు మరియు యండమూరి వీరేంద్ర నాథ్ గారు పుస్తకాన్ని కామెంట్ చేయండి , మీ ఆలోచనలను , అభిప్రాయాలను కూడా చెప్పండి.