తెలంగాణలోనే యంగెస్ట్ సర్పంచ్ అఖిల యాదవ్. హైదరాబాద్ నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనాపురం(నల్గొండ జిల్లా)అనే 300 కుటుంబాలు నివసించే గ్రామం వారిది. 2019లో ఎలక్షన్లలో గెలిచి ప్రస్తుతం కోవిడ్19 పై పోరాటం మాత్రమే కాదు, భవిషత్తులో మరో సర్పంచ్ వస్తే కనుక పాపం అతను ఇక్కడ చెయ్యడానికి వేరే అభివృద్ధి కార్యక్రమాలేమి లేకుండా చేసేశారు.
మా ఊరిలోకి ఎవ్వరు రావద్దు!! గ్రామంలో దాదాపు 50మందికి పైగా కల్లుగీత కార్మికులు ఉన్నారు. హైదరాబాద్ నుండే కాక చుట్టుపక్కల నుండి కూడా కార్లు, బైక్స్ పై వందలాది మంది ఈ ఊరికి వస్తూ ఉంటారు. ఐతే లాక్ డౌన్ విధించిన తొలిరోజులలోనూ బయటి ఊరివారు కల్లు కోసం వచ్చేవారు. ఎంత చెప్పినా గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఏకంగా అఖిలనే గ్రామం పొలిమేరలో కంచె వేసి తనే ఊరికి కాపలాగా నిల్చున్నారు. అఖిల పేరు సోషల్ మీడియాలో వైరల్ ఐన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వారు భయపడి రావడం ఆపజేసినా కానీ తర్వాత ఉదయం 3 గంటలకే వెళ్లి కొంతమంది తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు.
ఈసారి అఖిల స్ట్రాటజీ మార్చారు. కావాలనే వారిని ఊరి లోపలికి అనుమతించి కల్లు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు వారిని మందలించి కల్లు పారబోయడం, బైక్స్ లో గాలితీయడం, మాటవినని వారిని పోలీసులకు అప్పజెప్పడం లాంటివి చెయ్యడం మూలంగా ఇప్పుడు ఆ ఊరిలోకి వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కల్లుగీత కార్మికులు నష్టపోకుండా లోకల్ సిటీజన్స్ కు అమ్ముకునే సౌలభ్యం కూడా అమలుచేసి వారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


యంగస్ట్ సర్పంచ్: డిగ్రీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం మొదలుపెట్టిన కొన్నినాళ్ళకే లో ఎన్నికలు మొదలయ్యాయి, అఖిలకు ఈ ఎలెక్షన్స్ లో పోటిచెయ్యలని ఉంది, ఇదే విషయాన్ని నాన్నను అడిగారు. నాన్న కూడా ఇంకో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పేసుకున్నారు. అఖిల కుటుంబంలోని తాత లాలయ్యగారు, నాన్న అక్రమ్ యాదవ్ గారికి ఉన్న మంచిపేరు మూలంగా ఎన్నికలలో పెద్ద కష్టం లేకుండానే 22 ఏళ్లకే సర్పంచ్ గా గెలిచారు. ఇక అఖిల తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.


స్కూల్ లో టీచింగ్: ఎన్నిక కాక ముందు నుండే వివిధ రకాల సమస్యలతో పాటు ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లోనూ కొన్ని సమస్యలు తనకు తెలుసు. స్కూల్ లో ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు తనే వెళ్లి ఇంగ్లీష్ తో పాటు, జికె సబ్జెక్ట్ టీచ్ చెయ్యడం మొదలుపెట్టారు, సర్పంచ్ రావడాన్ని చూసి మిగిలిన టీచర్లు రెగ్యులర్ గా రావడం మొదలుపెట్టారు, అఖిల మధ్యాహ్న భోజనం స్కూల్ లో చేయడం వల్ల పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఎంతో భరోస కలిగింది. ఇప్పుడు పరిస్తితి ఎలా ఉందంటే అఖిల ఏదో పనిమీద ఒక్కరోజు స్కూల్ కు వెళ్ళకపోయినా పిల్లలు దిగులుపడుతున్నారు, ఆదివారం కూడా పిల్లలు అఖిల ఇంటికి వెళ్లి అక్క ఏమైనా చెప్పండక్క ఏదైనా కథలు కానీ, జనరల్ నాలెడ్జ్ విషయాలు కానీ చెప్పండి అని అడుగుతున్నారు.



రాబోయే సర్పంచ్ నాటికి సమస్యలేమి ఉండవు: అఖిల సర్పంచ్ గా ఎన్నికై దాదాపు సంవత్సరంన్నర కావస్తోంది. సమస్యలను చకచకా పరిష్కరించడం, ఊరి అభివృద్ధికి కావాల్సిన నిధులు ప్రభుత్వం నుండి నేర్పరితనంతో త్వరగా రాబడుతుండంతో అఖిల పదవి కాలం పూర్తయ్యేనాటికి ఇంకేసమస్య ఉంది అని వెతుకునే పరిస్థితి. ఊరిలో లైబ్రరీ కట్టించడం, హరితహారంలో భాగంగా వేలాది మొక్కలు నాటించడం వాటికి నీరు ప్రతిరోజు పోయడం, కంచె పాతి కాపాడడం చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం మెయిన్ రోడ్ సాంక్షన్ చేసింది, లోకల్ గా సీసీ రోడ్డు కూడా ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయి కానీ ఈ లాక్ డౌన్ వల్ల పనులకు కాస్త బ్రేక్ పడింది, 100% ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, 100% ప్రతి ఇంటికి వాష్ రూమ్, 100% ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు. ఒక సర్పంచ్ గా ఊరికి ఏ పనులు ఐతే చెయ్యగలరో ఆ పనులన్నీ అఖిల పూర్తిచేయ్యగలుగుతున్నారు. యంగస్ట్ సర్పంచ్ మాత్రమే కాదు, క్విక్ డెవలపర్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు.



You Can Reach: https://www.facebook.com/AkhilaSarpanch/?ti=as