From Securing 0 Marks To Doing A Ph.D In Chemistry, This Man's Story Of Success Is Inspiring AF!

Updated on
From Securing 0 Marks To Doing A Ph.D In Chemistry, This Man's Story Of Success Is Inspiring AF!

"డబ్బు సంపాదన కన్నా విలువైన సమయాన్ని జ్ఞానం పెంచుకోవడం కోసం వెచ్చిస్తే అసలుకు రెట్టింపు వడ్డీ వస్తుంది" - బెంజిమెన్ ఫ్రాంక్లిన్

మన వ్యక్తిత్వ పటిష్టత మీద మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. నిన్నటి వరకు జరిగిన సతీష్ గారి జీవితం ఒక సినిమా కథను పోలి ఉంటుంది. అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదగడంలో.. ఆ ఎదుగుదల అటు ఆర్ధికంగా ఇటు చదువులోనూ కొనసాగింది. ఓసారి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 100కు సతీష్ కు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అసలు మార్కులే రాలేదు(0). అలాంటి విద్యార్ధి కొన్ని సంవత్సరాలు గడిచే సరికి అదే సబ్జెక్ట్ లో పి.హెచ్.డి పూర్తిచేశాడు. ఒక మనిషి మనస్పూర్తిగా పోరాడితే సాధించలేనిదంటు ఏది ఉండదు అని మరోసారి సతీష్ గారు నిరూపించాడు.

చేసిన ప్రతి పనిలోనూ నిజాయితీ: నాన్న మండ సమ్మయ్య గారు ఓ కల్లు గీత కార్మికుడు, అమ్మ సులోచన గారు గృహిణి. చిన్నతనం నుండి సతీష్ కు "బాగా చదువుకోవాలి చదువు వల్లనే మా కుటుంబ పరిస్థితులు మారుతాయి" లాంటి ఆలోచనలేవి లేవు. అందరి దండేపల్లి గ్రామస్థుల లానే తన ఆలోచనలు సాధారణంగానే ఉండేవి కాకపోతే అందులో నిజాయితి కలిసి ఉండేది. చిన్నతనం నుండి యావెరేజ్ స్టూడెంట్ ఐన సతీష్ కుటుంబ ఆర్ధిక అవసరాల కోసం ఇంటర్మీడియట్ నుండి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే తాటి చెట్లను ఎక్కడం మొదలుపెట్టాడు. నిజాయితీగా స్వచ్చమైన కల్లును అందించేవాడు. "కల్లుగీయడమే నీ జీవితం కాదు, బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి" అనే ప్రోత్సాహం వల్ల తక్కువ మార్కులతో ఫేయిల్ అవుతున్నా చదువును మాత్రం నిర్లాక్ష్యం చేయలేదు.

ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో సున్నా మార్కులతో ఫేయిల్ ఐయ్యాక "ఆ సబ్జెక్ట్ ఇక నాకు జన్మలో రాదు" అని సతీష్ ఫిక్స్ ఐపోయేదుంటే ఈరోజు ఇలా మనమందరం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. తను ఓడిపోయిన ప్రతి చోట ఆగిపోలేదు, శ్రమపడి మళ్ళి పరీక్ష రాసి అతి తక్కువ మార్కులతో పాసయ్యాడు. తర్వాత డిగ్రీ తన జీవితానికి గొప్ప మలుపే తీసుకువచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే డిగ్రీలోనే కదా డా. నాగుల శంకరయ్య మష్టారు గారిని కలిసింది.

42% నుండి 70%.. రాయి సరైన శిల్పి చేతిలో పడితే దాని రూపు రేఖలు మారిపోతాయి. శంకరయ్య గారి ప్రోత్సాహంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ విపరీతంగా పెంచుకున్నాడు సతీష్. తోటి విద్యార్ధులు మార్కుల కోసం చదివితే తను మాత్రం తెలియని విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ 42%తో పాస్ ఐతే శంకరయ్య గారి వల్లనే డిగ్రీలో 70%తో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఎస్.సి కెమిస్ట్రీలో పీ.జి పూర్తిచేయడం, ప్రతిష్టాత్మక పి.హెచ్.డి ప్రవేశ పరీక్షలో 82 ర్యాంకుతో అర్హత సాధించడం, డా. అహ్మద్ కమల్ గారి నేతృత్వంలో క్యాన్సర్ ను నిర్మూలించే కారకాలపై రీసెర్చ్ చేసి Organic & Medicinal Chemistry మీద పి.హెచ్.డి నీ అందుకున్నారు. ఈ విజయం ఊరి ప్రజలతో పాటుగా, తనకెంతో ఇష్టమైన శంకరయ్య మాష్టారు గారిని కూడా ఆశ్చర్యానికి లోను చేసింది.

విజయం వెనుక అర్ధాంగి: అవును ప్రతి విజేత వెనుక ఓ స్త్రీ చేసిన త్యాగం, స్పూర్తి ఉంటుంది. ఆ స్త్రీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, ప్రియురాలు కావచ్చు. ఆరోగ్యం క్షీణించడం వల్ల సతీష్ అమ్మ గారు చనిపోయినప్పుడు కనీసం దహన సంస్కారాలకు డబ్బులులేని పరిస్థితి సతీష్ ది. మేనమామ కూతురు ఆ కష్టకాలం నుండి, చదువు కోసం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో నగలు సైతం తాకట్టు పెట్డడానికి సైతం వెనుకాడకుండా అండగా నిలబడి నేడు పి.హెచ్.డి అందుకోవడం వరకు సతీష్ విజయానికి తన అర్ధాంగి వారధిగా నిలిచారు.