Contributed By Ravi kiran Mulukutla
ఓ చిన్న నవ్వు చాలు... ప్రపంచాన్నే జయించొచ్చు... ఇది అందరికీ తెలిసిన Personality development Line ఏ... దీన్నే ఓ తెలుగు సినీ గేయ రచయిత .. "ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు.. ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు " అని రాసారు.
అయితే ఇలాంటి కొటేషన్స్ Instant Inspiration గా అనిపించినా మనలో చాలా మంది కాసేపటికి .. ఆ ఇవన్ని whatsapp లో forward message లు గా బానే ఉంటాయి గానీ నిజ జీవితంలో workout అవ్వవు అనే నిరాశ వచ్చేస్తుంది. కానీ ఆ ఆలోచన తప్పని నిరూపిస్తూ Internetని తన నవ్వుతో shake చేస్తున్నాడు ఓ సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్.
అతనే సోనూ భాయ్. అతని పాపులారిటీకి కారణమల్లా అతని నవ్వే. నవ్వేగా అందులో యేముంది అనుకుంటున్నారా.. మనలో చాలా మంది ఎంతో సంపాదిస్తున్నా ఇంకేదో కావాలి.. నా జీవితంలో ఇంకేదో లేదు అని లేని దాని కోసం పాకులాడుతూ present moment లోని ఆనందాన్ని కోల్పోతుంటాం.
కానీ మన సోనూ భాయ్ ఓ టిక్‌టాక్ వీడియోలో ఇలా తన గురించి నవ్వుతూ వివరించాడు – “ మీరేం చేస్తారు : Zomato Food delivery రోజుకి ఎంత సంపాదిస్తారు : 350 ప్లస్ incentives “
రెండు వాక్యాలు చెబుతూ అతనిచ్చిన నవ్వు నెటిజన్లను కట్టిపడేప్తోంది. నెటిజన్లు ఆనందించి, అభినందించినంత మాత్రన సోనూకి ఏం ఉపయోగం అనుకునేరు…. మనోడి నవ్వుకి , అతని క్రేజ్ చూసి అతను పనిచేసే కంపెనీ జొమాటోకే మెంటలెక్కేసింది. రాత్రికి రాత్రే తమ Instagram account DP గా మనోడి ఫొటో పెట్టేసుకుంది.
సాధారణ ఉద్యోగిగా ఉన్న సోనూ ... పెద్ద పెద్ద స్టార్స్ endorse చేసుకునే కంపెనీకి Brand ambassador అయిపోయాడు. ఏది ఎమైనా రోజుకి కేవలం 350 సంపాదిస్తూ , అది చెప్పుకోటానికి ఎలాంటి నామోషీ , బాధ పడకుండా నవ్వుతూ ఉన్న సోనూ భాయ్ ని చూసి ఎంతో మంది స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
Ika athani smile ni add chesi punkhanu punkhaluga memes puttukosthunnaayi. Zomato aithe ekanga tana photo ni dp gaa marcheskuni " welcome to the happy rider fan club account ❤️" ani bio lo pettukundi.



Manam kuda navvuthu undhaam Ratna, Eppudo okappudu famous avtham le.